ఠాణే, అక్టోబర్ 26: కీర్తాంకర్గా పేరొందిన ప్రముఖ మత బోధకుడు బాబా మహారాజ్ సతార్కర్ కన్నుమూశారు. చాలాకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన నవీ ముంబై టౌన్షిప్లోని నేరల్లో గురువారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 89 ఏండ్ల సతార్కర్ మహారాష్ట్రతో పాటు విదేశాల్లో పలు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. సతార్కర్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం షిండే సంతాపం తెలిపారు.