యోధ్య : అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం రేపుతుందో చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు బుధవారం రెండోసారి సమావేశం అయింది. ఆలయానికి కొంత మందితో కలిసి మతపరమైన కమిటీని నియమిస్తూ ట్రస్టు నిర్ణయం తీసుకుంది. ఇందులో అయోధ్యకు చెందిన ఐదుగురు నిపుణులకు చోటు కల్పించింది. ఆలయంలో జరిగే అన్ని రకాల పూజలు, ఆచారాలు, వార్షిక మతపరమైన కార్యక్రమాలు ఈ కమిటీ పర్యవేక్షణలో జరుగుతాయి. కమిటీలో ట్రస్టు నుంచి కూడా కొందరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆలయానికి ఒక సీఈవోను నియమించాలని త్రిసభ్య కమిటీని వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సెప్టెంబర్ 2 లోపు సీఈవోను ఎంపిక చేయాలని ట్రస్టు ఆదేశించింది.