న్యూఢిల్లీ: కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (కేపీఐఎల్)కు అప్పిలేట్ అథారిటీ ఊరటనిచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరం కోసం కేపీఐఎల్ క్లెయిమ్ చేసిన జీఎస్టీఆర్-3బీలోని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ), జీఎస్టీఆర్-2ఏలో పేర్కొన్న ఐటీసీకి మధ్య పొంతన లేదని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (సీజీఎస్టీ) డిపార్ట్మెంట్ ఆరోపించింది.
తాము సమర్పించిన సమాధానాన్ని పరిశీలించకుండానే జీఎస్టీని, పెనాల్టీని చెల్లించాలని సీజీఎస్టీ డిపార్ట్మెంట్ డిమాండ్ చేస్తున్నట్లు కేపీఐఎల్ తెలిపింది.దీనిపై అప్పీల్‌ను దాఖలు చేయడాన్ని అప్పిలేట్ అథారిటీ సమర్థించింది.