ICRIER | కేంద్రం అనాలోచిత నిర్ణయంతో రైతులకు 45 వేల కోట్ల నష్టం.. ఐసీఆర్ఐఈఆర్ నివేదికలో సంచలన విషయాలు
నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. గోధుమలు, బియ్యం ఎగుమతులపై నిషేధంతోపాటు ఎంఎస్పీ ధరల కంటే తక్కువకే కేంద్రం గోధుమలను ఓపెన్ మార్కెట్లో విడుదల చేయటం వల్ల రైతులకు రూ.45 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
ICRIER | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. గోధుమలు, బియ్యం ఎగుమతులపై నిషేధంతోపాటు ఎంఎస్పీ ధరల కంటే తక్కువకే కేంద్రం గోధుమలను ఓపెన్ మార్కెట్లో విడుదల చేయటం వల్ల రైతులకు రూ.45 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్ (సీఆర్ఐఈఆర్ )కు చెందిన ఆర్థికవేత్తలు తమ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. అశోక్ గులాటి, రాయదాస్, సంచిత్ గుప్తా, మనీష్ కుమార్ ప్రసాద్ తదితరులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలు నీరుగారిపోవడానికి గల కారణాలతో పాటు ప్రత్యామ్నాయ పరిష్కారాలను సూచించారు.
ఎగుమతుల నిషేధంతో తీవ్ర నష్టం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల గోధుమలు, బియ్యం ఎగుమతులపై నిషేధం విధించి ధరల నియంత్రణకు ప్రయత్నం చేసినా, అనుకున్నంత ఫలితాలు రాబట్టలేక పోయిందని నివేదిక పేర్కొంది. 2022 మేలో ద్రవ్యోల్బణం 10% కంటే తక్కువగా ఉన్నప్పుడు కేంద్రం గోధుమల ఎగుతులను నిషేధించిందని, కానీ ఈ చర్య వల్ల గోధుమల ధరలు తగ్గకపోగా, మార్కెట్లో అనిశ్చితి ఏర్పడి మరింత నష్టం జరిగిందని నివేదిక పేర్కొంది. గోధుమ పిండి ఉత్పత్తుల ఎగుమతులను నిషేధించినప్పుడు, 2022 ఆగస్టులో గోధుమల ద్రవ్యోల్బణం 15.7 శాతానికి పెరిగిందని నివేదికలో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 2023 ఫిబ్రవరిలో పంట సీజన్‌కు ముందు గోధుమల ధరలు 25.4 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర కంటే కూడా చాలా తక్కువకే రైతుల నుంచి 30.4 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు ఎఫ్‌సీఐ కొన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ చర్య వల్ల గోధుమల ధరలు ఒక దశలో నియంత్రించినా రైతులకు మాత్రం చాలా నష్టం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు.
గోధుమల దిగుమతి సుంకం తగ్గించాలి…
ధరల నియంత్రణకు నివేదికలో కొన్ని సూచనలు చేశారు. గోధుమలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతమున్న 40 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని సూచించారు. దీని వల్ల ప్రభుత్వం 50- 60 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు దిగుమతి చేసుకోవచ్చన్నారు.
కోల్డ్ స్టోరేజీలు పెంచాలి
ఎంఎస్పీ (మద్దతు ధర) కంటే తక్కువ ధరలకు ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వం విక్రయించడం మానుకుంటే రైతులకు లాభం చేకూరుతుందని నివేదిక పొందుపరిచారు. వ్యాపారులు నిల్వ చేయకుండా అరికట్టవచ్చు. ఉత్పత్తులను నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజీ లాంటి మౌలిక సదుపాయాలను మరింత విస్తరించాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

