UGC | న్యూఢిల్లీ: కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు/మైగ్రేషన్స్ను సెప్టెంబరు 30 నాటికి రద్దు చేసుకున్న విద్యార్థులకు వారు చెల్లించిన ఫీజును పూర్తిగా తిరిగి ఇచ్చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. అక్టోబరు 31నాటికి రద్దు చేసుకున్నవారికి రూ.1,000కి మించకుండా తగ్గించుకుని, మిగిలిన ఫీజును తిరిగి ఇచ్చేయాలని చెప్పింది. మార్గదర్శకాలు/ ప్రాస్పెక్టస్/ నోటిఫికేషన్/ షెడ్యూలులో ఏది ఉన్నప్పటికీ ఈ విధంగా ఫీజును రీఫండ్ చేయాలని వివరించింది. యూజీసీ కార్యదర్శి మనీష్ ఆర్ జోషీ ఈ నెల 12న ఈ మేరకు ఓ సర్క్యులర్‌ను జారీ చేశారు.
యూజీసీ నెట్-2024 పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది. ఈ నెల 18న 83 సబ్జెక్టులో ఈ పరీక్ష ఉంటుంది. అధికారిక వెబ్సైట్ https:// ugcnet.nta.ac.in/లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. అడ్మిట్‌కార్డుతోపాటు అండర్‌టేకింగ్‌ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. డౌన్లోడ్ చేసుకోవడంలో ఏమైనా సమస్య తలెత్తితే.. 011-40759000 నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా ugcnet@nta.ac.inకు ఈమెయిల్ చేయాలని పేర్కొన్నది.