ముంబై, ఫిబ్రవరి 15: ఇటీవల సహజీవనం హత్యలు వెలుగుచూస్తున్నాయి. కొద్దికాలం కిందట ఢిల్లీలో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన ఘటన మరువకముందే.. అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకున్నది. మేఘాధన్ సింగ్ తోర్వి అనే మహిళను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని పరుపు కింద డబ్బాలో దాచాడు నిందితుడు హార్దిక్ షా. వీరిద్దరూ కొంతకాలంగా కలిసి జీవిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందోగానీ.. తోర్విని చంపి ఆమె మృతదేహాన్ని పరుపు కింద డబ్బాలో దాచాడు హార్దిక్. దీంతో మృతదేహం కుళ్లిపోయి వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి మంగళవారం వచ్చిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు.