పాట్నా, ఆగస్టు 6: కేంద్ర మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్.. జేడీ(యూ) పార్టీకి శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. జేడీ(యూ) ఓ మునిగిపోతున్న నావ అని మండిపడ్డారు. అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా పార్టీ ఆయనకు నోటీసులు జారీచేయడంతో మనస్తాపంతో పార్టీని వీడారు. ఆయన ఆస్తులకు సంబంధించిన వివరాలు అసంబద్ధంగా ఉన్నాయని జేడీయూ ఆరోపిస్తున్నది.