RBI governor : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ (Governor) శక్తికాంత దాస్ (Shaktikanta Das) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆర్బీఐ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. కొన్ని గంటల పరిశీలన అనంతరం సాయంత్రం ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.