బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నిక
కోల్కతా, మే 4: పశ్చిమ బెంగాల్లో ఆర్జీ కార్ దవాఖాన బాధితురాలి తల్లి రత్న దేబ్నాథ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థినిగా పణిహతి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె ప్రత్యర్థి టీఎంసీ అభ్యర్థిపై 28,336 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థిని అయిన దేబ్నాథ్ కుమార్తె డ్యూటీలో ఉండగా 20 నెలల క్రితం దవాఖాన ఆవరణలోనే హత్యాచారానికి గురయ్యారు. అప్పటి నుంచి తనకు న్యాయం చేయాలని దేబ్నాథ్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్నది. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే మహిళలకు న్యాయం జరగడం లేదని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె అనుచిత పదజాలంతో సీఎం మమతను దూషించారని టీఎంసీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.