గార్ల, జూలై 29 : మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ భూసేకరణకు సంబంధించి మహబూబాబాద్ కలెక్టర్ జాతీయ ఎస్టీ కమిషన్కు త ప్పుడు నివేదిక ఇచ్చారని మున్నేరు జలసాధన కమిటీ సభ్యుడు శీలంశెట్టి రమేశ్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జం పాల విశ్వ ఆరోపించారు. బుధవారం రాజకీ య పార్టీల నేతలు, మున్నేరు జలసాధన క మిటీ సభ్యులతో కలిసి మహబూబాబాద్ జి ల్లా గార్ల మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ మాట్లాడుతూ.. పాలేరు లింక్ కెనాల్ భూ సేకరణకు సంబంధించి పెసా గ్రామ సభల్లో ఆమోదం లభించిందని జాతీయ ఎస్టీ కమిషన్కు కలెక్టర్ స్నేహాశబరీష్ నివేదిక ఇవ్వడం వాస్తవ దూరమన్నారు. గార్ల మండలంలోని 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతంలో జీవో 98 ద్వారా చేపడుతున్న పాలేరు లింక్ కెనాల్ పేరుతో గిరిజన రైతుల సారవంతమైన భూములు, నివాస స్థలాలు లాక్కునేందుకు ఆధికారులు బలవంతపు సర్వే చేస్తున్నారని ఆరోపించారు.
న్యూఢిల్లీలో తాము దాఖలు చేసిన ఫిర్యాదుమేరకు ఎస్టీ కమిషన్కు కలెక్టర్ ఈ నెల 10న సమర్పించిన నివేదిక పూర్తిగా అసంబద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని, గిరిజనులను మోసం చేసేదిగా ఉందనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయని చెప్పారు. పెసా చట్టం నియమాలు పాటించకుండా జీపీ కార్యాలయాల్లో కేవలం సర్పంచులు, కార్యదర్శులు, కొద్దిమంది నాయకులతో పెట్టిన సాధారణ సమావేశ తీర్మానాలను పెసా తీర్మానాలుగా చిత్రీకరించి జాతీయ ఎస్టీ కమిషన్కు పంపారని ఆరోపించారు. తప్పుడు నివేదికలు ఇచ్చి గిరిజనులను మోసం చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలను తొక్కి పెట్టేందుకు పోలీ సు బలగాలతో బలవంతపు సర్వేలు చేశరని వెల్లడించారు. సమావేశంలో సామాజి క కార్యకర్త ఈశ్వర్, సీపీఎం, సీపీఐ నాయకు లు గో వింద్, హరినాయక్, యాదవ సంఘం నాయకులు రాములు, మహేశ్ పాల్గొన్నారు.