రతన్ టాటా… ప్రముఖ పారిశ్రామికవేత్త. అత్యంత సింపుల్గా ఉంటూ అందర్నీ ఆకర్షిస్తుంటారు. భారత పారిశ్రామిక రంగంలో తలలో నాలుక. అంతటి వ్యాపార దిగ్గజం.. సింపుల్గా నానో కారులో ముంబైలోని తాజ్ హోటల్కి వచ్చారు. ఒక్క సెక్యూరిటీ పర్సన్ కూడా ఆయనతో లేడు. కేవలం ఆయన పీఏ, హోటల్ సిబ్బంది మాత్రమే ఉన్నారు.
రతన్ టాటా సింప్లిసిటీ చూసి… నెటిజన్స్ తెగ ముచ్చటపడ్డారు. ఆయనకు సెల్యూట్ కూడా చేశారు. రతన్ టాటా నానా కారులో సింపుల్గా తాజ్ హోటల్కి వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సో సింపుల్.. అండ్ హంబుల్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. లెజెండ్ అంటూ మరి కొందరు కామెంట్ చేశారు. గొప్ప మానవతా వాది… మానవతా వాదికి నిండుతనం రతన్ టాటా అంటూ మరి కొందరు కామెంట్స్ చేశారు.
టాటా తరపున నానో కారును రతన్ టాటా మార్కెట్లోప్రవేశపెట్టి, సంచలనం రేపారు. ఈ కారంటే ఆయనకు మహా అభిమానం. సామాన్య కుటుంబీకులు తరుచూ తమ పిల్లలతో స్కూటర్ల మీద వెళ్లడం చూశానని, ఇలా వెళ్లడం వల్ల వారికి ఇబ్బంది కలుగుతుందని భావించినట్లు ఈ మధ్య జరిగిన ఎక్స్పోలో రతన్ టాటా పేర్కొన్నారు. అందుకే నానో తెచ్చానని, ఇది ఎప్పటికీ ప్రజల కోసమేనని రతన్ టాటా ప్రకటించారు.