జైపూర్: ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి లోక్సభకు ఎన్నికైతే.. రెండు సభల్లో కొనసాగేలా నిబంధనలు ఉండాలని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) ఎంపీ హనుమాన్ బేనీవాల్ అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఇలాంటి నిబంధన ఉన్నదని, భారత్లో ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు.
రాజస్థాన్లోని నాగౌర్ నుంచి ఆయన ఎంపీగా గెలుపొందారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 (2) ప్రకారం.. ఏ వ్యక్తి కూడా ఒకేసారి ఎంపీగా, శాసనసభ సభ్యుడిగా కొనసాగడానికి వీల్లేదు. లోక్సభ, శాసనసభ సభ్యుడిగా కొనసాగేలా నిబంధన ఉండాలని, రెండు పోస్టుల్లో ఉంటే తప్పేంటని బేనీవాల్ ప్రశ్నించారు.