వాషింగ్టన్, నవంబర్ 11: మానవ కారణాలతో గత 150 ఏండ్లుగా భూతాపం పెరుగుతున్న వేగం గడిచిన 24 వేల ఏండ్లలో ఎన్నడూ లేదని అమెరికాలోని అరిజోనా వర్సిటీ అధ్యయనం వెల్లడించింది. పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా 200 ఏండ్లకొకసారి వాతావరణ మార్పులపై మ్యాపులను రూపొందించి విశ్లేషించారు. ఇందులో భాగంగా సముద్ర తీర ప్రాంతాల్లో రసాయన అవశేషాలపై, జంతు కళేబరాలపై పరిశోధనలు నిర్వహించారు. వాతావరణంలో మార్పుల వల్ల వాటిల్లో కలిగిన మార్పులను అధ్యయనం చేశారు. తద్వారా భూతాపం తీవ్రతను అంచనావేశారు. ఈ వివరాలను నేచర్ అనే జర్నల్లో ప్రచురించారు.