పరేడ్‌లో భాగంగా వాయుసేన ప్రదర్శించిన శకటంపై రాఫెల్‌ను నడిపిన తొలి మహిళా పైలట్ శివాంగి సింగ్ సెల్యూట్ చేస్తూ అందరినీ ఆకర్షించారు. వాయుసేన శకట ప్రదర్శనలో పాల్గొన్న రెండో మహిళా పైలట్ ఈమెనే. గతేడాది ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనకాంత్ వాయుసేన శకటంపై కనిపించిన తొలిమహిళగా రికార్డుకెక్కారు.