చండీఘడ్: అత్యాచార నిందితుడు గుర్మీత్ రామ్ రహీమ్(Gurmeet Ram Rahim)కు 40 రోజుల పెరోల్ మంజూరీ చేశారు. మూడు నెలల క్రితం అతనికి 21 రోజుల పెరోల్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. హర్యానాలోని రోహతక్‌లో ఉన్న సునరియా జైలు నుంచి గుర్మీత్ బయటకు వచ్చారు. 2017లో అతన్ని అత్యాచార కేసులో అరెస్టు చేశారు. అయితే పెరోల్‌పై అతను జైలు నుంచి బయటకు రావడం ఇది 14వ సారి . సిర్సాలో ఉన్న డేరా ఆశ్రమంకు గుర్మీత్ వెళ్లినట్లు అధికారులు చెప్పారు. ఇద్దరు భక్తులను రేప్ చేసిన కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష పడింది.
జర్నలిస్టు రామ చందర్ ఛాత్రపతి మర్డర్ కేసులోనూ గుర్మీత్ దోషిగా ఉన్నారు. మేనేజర్ రంజిత్ సింగ్ మర్డర్ కేసులోనూ అతనికి జీవితకాల జైలుశిక్ష పడింది. పంజాబ్, హర్యానాలో ఎన్నికల వేళ సాధారణంగా కొందరు రైప్ నిందితులకు పెరోల్ ఇస్తుంటారు. 2022లో మూడు సార్లు గుర్మీత్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఆ సమయంలో పంజాబ్ ఎన్నికలు జరిగాయి. హర్యానాలోనూ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. 2020లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా గుర్మీత్‌కు 40 రోజుల పెరోల్ ఇచ్చారు.