బెంగళూరు: లైంగిక దాడి కేసులో నిందితుడైన ఒక వ్యక్తి 40 అడుగుల ఎత్తైన గోడ దూకి జైలు నుంచి తప్పించుకున్నాడు. (Accused Jumps 40-Foot Wall) ఆ మరునాడు పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. అయితే ఆ ఖైదీ గోడ దూకి జైలు నుంచి తప్పించుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. అత్యాచారం ఆరోపణల కింద నమోదైన కేసులో 23 ఏండ్ల వసంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం అతడ్ని దావణగెరె సబ్ జైలులో ఉంచారు. అయితే రిమాండ్ ఖైదీగా ఉన్న వసంత్ ఆ జైలు నుంచి తప్పించుకున్నాడు. శుక్రవారం జైలు చుట్టూ ఉన్న 40 అడుగుల ఎత్తైన గోడ నుంచి మరోవైపు దూకాడు. ఈ నేపథ్యంలో స్వల్పంగా గాయపడిన అతడు అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న జైలు సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుడు వసంత్ జైలు నుంచి తప్పించుకున్న విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో అతడి కోసం వెతికిన పోలీస్ బృందాలు వసంత్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆ ఖైదీ గోడ దూకి జైలు నుంచి తప్పించుకున్న సంఘటన ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video Shows Karnataka Prison Break, Inmate Jumps Across 40-Foot Wall To Escape https://t.co/YiBNtXVFEu pic.twitter.com/X3izrGzOEq
— NDTV (@ndtv) August 28, 2023