న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తనపై నమోదైన అనేక ఎఫ్ఐఆర్లను సవాలు చేస్తూ ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూట్యూబ్లో కమెడియన్ సమయ్ రైనాకు చెందిన ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అలహాబాదియాపై దేశవ్యాప్తంగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
అలహాబాదియా తరఫున మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తనయుడు, న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ వాదనలు వినిపించారు. అభినవ్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం రానున్న రెండు, మూడు రోజుల్లో దీన్ని లిస్టింగ్ చేస్తామని తెలిపింది.