ఫొటోలో కనిపిస్తున్న ఈ ఆవు పేరు ‘రాణి’. 23 నెలల వయసున్న ఈ ఆవు ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కారణం.. ఈ గోవు అత్యంత చిన్నగా ఉండటమే. రాణి పొడవు 66 సెంటీమీటర్లు. ఎత్తు 51 సెంటీమీటర్లు. బరువు 26 కిలోలు. గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన ఆవు కంటే రాణి ఎత్తు 10 సెంటీమీటర్లు తక్కువని బంగ్లాదేశ్‌కి చెందిన ఆవు యజమాని చెబుతున్నాడు.