బెంగళూరు: పారిశ్రామికవేత్త రతన్ టాటాకు (Ratan Tata) రంగోలి కళాకారుడు రంగులతో నివాళి అర్పించారు. ఆయన ఆత్మ నిష్క్రమిస్తున్నట్లుగా ఉన్న చిత్రాన్ని తీర్చిదిద్దారు. మెట్రో స్టేషన్లో వేసిన రతన్ టాటా నివాళి చిత్రం ఎంతో ఆకట్టుకుంటున్నది. బుధవారం తుది శ్వాస విడిచిన 86 ఏళ్ల రతన్ టాటాకు కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన రంగోలి కళాకారుడు అక్షయ్ జలీహాల్ వినూత్నంగా నివాళి అర్పించారు. నాడప్రభు కెంపేగౌడ మెట్రో స్టేషన్లో రంగు రంగుల ముగ్గులతో ఆయన చిత్రాన్ని తీర్చిదిద్దారు. నీలిరంగు బ్లేజర్‌తో రతన్ టాటా పోర్ట్రెయిట్ వేశారు. వెనుక ఉన్న మెట్లపై ఆయన ఆత్మ నిష్క్రమిస్తున్నట్లుగా ఉంది.
కాగా, రతన్ టాటా రంగుల నివాళి చిత్రం ఎంతో ఆకట్టుకుంటున్నది. బెంగళూరుకు చెందిన రంగోలి కళాకారుడు అక్షయ్ జలీహాల్ దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘వియ్ మిస్ యూ, వియ్ లవ్ యూ’ అని పేర్కొన్నారు. రతన్ టాటా అందరికీ స్ఫూర్తిదాయకమంటూ పలు ట్యాగ్లు ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
View this post on Instagram
A post shared by Bangalore Rangoli Artist Akshay jalihal (@akshayjalihal)