Ram Temple : అయోధ్య (Ayodya) రామమందిర (Ram Temple) నిర్మాణం ఈ ఏడాది జూన్ 5 కల్లా పూర్తికానుందని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా (Nripendra Mishra) తెలిపారు. జూన్ 5 తర్వాత ఒకటి రెండు రోజుల్లో భక్తులు రామ మందిరం పరిసరాల్లోని వేర్వేరు ఆలయాలను దర్శించుకునే అవకాశం కల్పించనున్నట్లు ఆయన చెప్పారు.
రామ మందిరం పరిసరాల్లో మహర్షి వాల్మీకి, శ్రీ వశిష్ఠ, అహల్య, నిషద్రాజ్ మహరాజ్, శబరీ మాత, అగస్త్య ముని ఆలయాలు ఉన్నాయని, ఆ అన్ని ఆలయాలను జూన్ 5న ప్రారంభం కానున్నాయని మిశ్రా వెల్లడించారు. రామ్ దర్బార్‌లో, రామ మందిరం పరిసరాల్లోని ఆరు ఆలయాల్లో జూన్ 5న పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 5 నాటి కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలను చంపట్ రాజ్ వెల్లడిస్తారని చెప్పారు.
రామ మందిరం నిర్మాణ క్రమంలో ఎదురైన అన్ని సవాళ్లను టీమ్ వర్క్‌తో అధిగమించామని నృపేంద్ర మిశ్రా చెప్పారు. ప్రతి రోజూ సవాళ్లు ఎదురయ్యాయని, ఆ సవాళ్లంటిని పరిష్కారాలు లభించాయని అన్నారు. భవిష్యత్తులో వెయ్యేళ్లపాటు చెక్కు చెదరకుండా ఉండేలా ఆలయ నిర్మాణం జరిగిందని తెలిపారు.