Dera Baba | డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు సంవత్సర కాలంలో 41 రోజుల ఫెరోల్ ఉందని.. దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టు తలుపుతట్టాడు. లైంగిక దాడి, హత్య కేసుల్లో గుర్మీత్ సింగ్ దోషిగా తేలడంతో ప్రస్తుతం రోహ్తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నారు. 20 రోజుల పెరోల్, 21 రోజుల ఫర్లఫ్లో బయటకు వచ్చేందుకు అర్హత ఉందని పేర్కొన్నాడు. అయితే, కోర్టు అనుమతి లేకుండా భవిష్యత్‌లో డేరా చీఫ్‌కు పెరోల్ దరఖాస్తును పరిగణలోకి తీసుకోవద్దని ఫిబ్రవరి 29న హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఫిబ్రవరి 29 నాటి ఉత్తర్వులపై స్టే ఎత్తివేయాలని కోరుతూ డేరా చీఫ్ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు మంజూరైన పెరోల్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దోషులతో సమానంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు తన హక్కులకు విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. హర్యానా చట్టం2022 ప్రకారం.. అర్హులైన దోషులకు ప్రతి క్యాలెండర్ ఇయర్లో 70 రోజుల పెరోల్, 21 రోజుల ఫలఫ్ మంజూరు చేసే హక్కు ఇచ్చింది. అయితే, శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) డేరా చీఫ్‌కు పెరోల్ ఇవ్వాలని హైకోర్టులో పలుసార్లు పిటిషన్లు వేసింది. దీంతో ఫిబ్రవరి నెలలో డేరా చీఫ్‌కు భవిష్యత్‌లో పెరోల్, ఫర్లో ఇవ్వకుండా నిషేధం విధించింది. తప్పనిసరిగా కోర్టు అనుమతి ఉండాల్సిందేనని చెప్పింది.