Haryana Elections : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై రాజస్దాన్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్పందించారు. క్రీడలు రాజకీయ రంగు పులుముకోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. రాజ్యవర్ధన్ రాథోడ్ సోమవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మనది ప్రజాస్వామ్య దేశమని, ప్రతి ఒక్కరికీ రాజకీయాల్లో చేరే హక్కు ఉంటుందని అయితే మరో రంగాన్ని అపవిత్రం చేయరాదని అన్నారు.
ఒలింపిక్స్‌లో ఓ క్రీడ అయిన రెజ్లింగ్‌లో ఎంతోమంది అథ్లెట్లు పాల్గొని దేశానికి పతకాలు సాధించిపెట్టారని గుర్తుచేశారు. ఇంతకుముందు అలాంటి వాతావరణాన్ని కల్పించకుంటే ఈసారి మరిన్ని పతకాలు మనకు లభించేవని రెజ్లర్ల ఆందోళనను ప్రస్తావిస్తూ మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
హరియాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు వీరు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. మరోవైపు వారి రాజీనామాలను రైల్వేలు సోమవారం ఆమోదించాయి. ఇక నార్తర్న్ రైల్వేస్‌లో వినేశ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) గా విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మరో రెజ్లర్ బజరంగ్ పూనియా కూడా ఓఎస్డీగానే పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల పోరులో దిగనున్నారు. వినేశ్ ఫోగట్‌కు జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీటు ఖరారైంది.
Read More :
Vatpalli SI Transfer | బర్త్‌డే ఎఫెక్ట్..వట్పల్లి ఎస్ఐ లక్ష్మణ్‌పై బదిలీ వేటు