న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ కూడా వాయిదాల పరంపర కొనసాగుతున్నది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే పన్నెండు మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ విపక్ష పార్టీలు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొన్నది. విపక్ష ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా నినాదాలు మారుమోగాయి. దాంతో రాజ్యసభ ఛైర్మన్ ( Rajya Sabha Chairman ) వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదావేశారు.
మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా సేమ్ సీన్ రిపీట్ కావడంతో ఛైర్మన్ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో సభ్యత, మర్యాదలకు భంగం కలుగునివ్వకూడదని కోరారు. అన్యాయం, అమర్యాద అన్నివేళలా పనిచేయవని ఆయన హెచ్చరించారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
Rajya Sabha adjourned till 2 pm following sloganeering by Opposition demanding to revoke the suspension of 12 Opposition MPs
— ANI (@ANI) December 14, 2021
"Let's maintain decency & decorum in the House. Unruly & unparliamentary behavior is not going to work at all," Chairman M Venkaiah Naidu says pic.twitter.com/YXousMSlvA