19 బిల్లులకు ఆమోదం.. రాజ్యసభ నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ: రాజ్యసభ ఇవాళ నిరవధిక వాయిదా పడింది. 253వ రాజ్యసభ సమావేశాలు ముగిసినట్లు చైర్మెన్ వెంకయ్యనాయుడు తెలిపారు. కోవిడ్ నిబంధలు పాటిస్తూ నిర్వహించిన రెండవ సెషన్ అని చెప్పారు. 23 సిట్టింగ్లతో సభ ముగించినట్లు తెలిపారు. మొత్తం 104 గంటల పాటు సభా కార్యకలాపాలు జరిగాయి. హౌజ్ ప్రొడక్టివిటీ 99 శాతం ఉన్నట్లు ఆయన చెప్పారు. విపక్ష సభ్యుల అవాంతరాల వల్ల సభ సుమారు 21 గంటల పాటు జరగలేదన్నారు. ఈ బడ్జెట్ సెషన్లో మొత్తం 19 బిల్లులు పాసైనట్లు వెంకయ్య వెల్లడించారు.
వాయలార్ భావోద్వేగం..
చివరి రోజు సందర్భంగా ఎంపీలు వాయలార్ రవి, కేకే రాగేశ్, అబ్దుల్ వాహబ్లకు ఫేర్వెల్ పలికారు. ఆ ముగ్గురికీ చైర్మన్ నివాళి అర్పించారు. వాళ్లు సభను వీడి వెళ్తున్నా.. వాళ్లు సభకు అమూల్యమైన భాగస్వామ్యాన్ని అందించారన్నారు. వాళ్లు కేవలం రిటైర్ అవుతున్నారని, అలసిపోలేదన్నారు. కేరళకు చెందిన వాయలార్ రవి .. నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఫేర్వెల్ సందేశం వినిపించిన ఎంపీ రవి.. సభలో భావోద్వేగానికి లోనయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

