న్యూఢిల్లీ: బీజేపీ వృద్ధ కార్యకర్త, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాటి జన సంఘ్ మాజీ ఎమ్మెల్యే భులై భాయ్‌ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం కలిసిశారు. ఢిల్లీలోని యూపీ భవన్లో ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శాలువా కప్పి భులై భాయ్‌ను సత్కరించారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. దేశంలో జన సంఘ్ కాలానికి చెందిన బీజేపీ కార్యకర్తల్లో భులై భాయ్ చాలా పెద్దవారని చెప్పారు. ఆయన వయసు 107 ఏండ్లని తెలిపారు. 1977లో ఉత్తరప్రదేశ్‌లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భులై భాయ్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. చాలా కాలం తర్వాత ఆయనను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
#WATCH | Delhi: Defence Minister Rajnath Singh today met one of the oldest (107-year-old) BJP workers & former Jana Sangh MLA from Uttar Pradesh Bhulai Bhai, at UP Bhavan. pic.twitter.com/js1JFRZKvG
— ANI (@ANI) October 14, 2021