Rajnath singh | భారత్కు హాని తలపెట్టాలని చూస్తే సహించనే సహించం : రాజ్నాథ్
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. భారత్కు ఎవరైనా హాని తలపెట్టాలని భావిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. భారత్ను ఇబ్బంది పెట్టాలని చూసే వారిపై కఠినంగానే వుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం భారత్ అత్యంత శక్తిమంతంగా ఎదుగుతోందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా టాప్లో ఉందని తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో లోని ఇండియన్- అమెరికన్ కమ్యూనిటీని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు.
‘భారత సైన్యం ఎలాంటి దీటైన జవాబిచ్చిందో బహిరంగంగా చెప్పలేను. అలాగే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో కూడా చెప్పలేను. కానీ… చైనాకు మాత్రం ఓ హెచ్చరిక వెళ్లింది. భారత ప్రభుత్వం అలాంటి వాటిని ఉపేక్షించదన్న విషయం మాత్రం అర్థమైంది. ఇండియాను ఇబ్బంది పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోదు అన్న విషయం మాత్రం చైనాకు బోధపడింది’. అని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
భారత్ దౌత్యపరంగా ఓ దేశంతో సత్సంబంధాలను కొనసాగించినంత మాత్రాన.. ఇతర దేశంతో సరైన దౌత్య సంబంధాలను కొనసాగించదన్న అర్థం కాదని, అలాంటి దౌత్య నీతిని భారత్ ఎప్పుడూ అవలంబించదని అమెరికాకు పరోక్షంగా చురకలంటించారు. భారత్ ఎప్పుడూ విన్-విన్ కాన్సెప్ట్ ప్రకారమే దౌత్యాన్ని నెరుపుతుందని రాజ్నాథ్ తేల్చి చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- china
- china army
- India
- india china
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

