న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త వైస్ చైర్మన్‌గా ఆర్థిక వేత్త సుమన్ బెరీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ నెల 30న రాజీవ్ కుమార్ పదవి నుంచి వైదొలుగుతారు. మే 1న బెరీ బాధ్యతలు స్వీకరిస్తారు.
గతంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా 2017లో రాజీవ్ కుమార్.. అరవింద్ పణగరియా నుంచి బాధ్యతలు స్వీకరించారు. సుమన్ బెరీ ప్రస్తుతం ఎన్సీఏఈఆర్ డీజీగా ఉన్నారు.