జైపూర్: రాజస్థానీ మహిళ చిరుత పులికి రాఖీ(Leopard Rakhi) కట్టింది. ఆ మృగాన్ని తన సోదరుడిగా భావిస్తున్నట్లు చెప్పింది. ఇక ఆ వన్యప్రాణి రక్షణ తనదే అన్నట్లు ఆమె పేర్కొన్నది. చిరుతకు రాఖీ కట్టిన దృశ్యాలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఓ వ్యక్తి తన సెల్ఫోన్లో ఈ ఘటనను బంధించాడు. రాఖీ కడుతున్న సమయంలో ఆ చిరుత సైలెంట్‌గా ఉండిపోయింది. వినోభోజక్ అనే వ్యక్తి ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియోను పోస్టు చేశారు.
చిరుత చుట్టూ చాలా మంది ఉన్నారు. అయితే ఆ మహిళ మాత్రం దాని ముందు కాలికి రాఖీ కట్టింది. ఇంకా ఆ జంతువుకు స్వీట్లు కూడా తినిపించే ప్రయత్నం చేసింది. స్థానికుల ప్రకారం ఆ చిరుత .. ఇటీవల గ్రామంలోకి పదేపదే వస్తున్నట్లు గుర్తించారు. మనుషులను చూసి ఆ మృగం భయపడడం లేదని తెలుస్తోంది.
అయితే ఈ ఘటన పట్ల నెటిజెన్లు విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ జనమే ఈ చిరును గాయపరిచారని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అనాగరిక ప్రజలు అని మరో వ్యక్తి పోస్టు చేశాడు. బహుశా డ్రగ్స్ తీసుకుందేమో అని మరో యూజర్ పేర్కొన్నాడు. మరో వైపు ఫారెస్ట్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. వన్యమృగాలకు దూరంగా ఉండాలని తెలిపారు.
यह तेंदुआ मेरा भाई है …अब इसे नहीं मारे …!!#SaveWildLife #Leopard #Rajsamand#रक्षाबन्धन #RakshaBandhan #राखी #राजस्थानी #Rajasthan #India pic.twitter.com/PidroBN3xq
— Vinod Bhojak (@VinoBhojak) August 9, 2025