జైపూర్: చంద్రయాన్-3 ప్రయోగంపై విలేకర్లతో మాట్లాడిన ఓ రాజస్థాన్ మంత్రి నోరుజారారు. చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపై అడుగుపెట్టనున్న ప్రయాణికులకు అభినందనలు అని క్రీడా శాఖ మంత్రి అశోక్ చంద్ర పొరపాటుగా పేర్కొన్నారు.
‘ఒకవేళ చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండింగ్ అయితే… అందులోని ప్రయాణికులకు నా అభినందనలు. మన దేశం అంతరిక్ష రంగంలో పురోగతి సాధించింది’ అని పేర్కొన్నారు. చంద్రయాన్‌ని మానవ సహిత యాత్రగా పేర్కొన్న ఆయన్ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.