జైపూర్: రాజస్థాన్ సామాజిక న్యాయశాఖ సంచాలకుడైన తన భర్త ఆశిష్ మోదీ తనపై చాలాకాలంగా గృహ హింసకు పాల్పడుతున్నారని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి భార్తీ దీక్షిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించేందుకు ఆశిష్ నిరాకరించారు. కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.
2014లో తన తండ్రి క్యాన్సర్తో పోరాడుతున్నప్పుడు తన భావోద్వేగ దుర్బలత్వాన్ని సొమ్ము చేసుకొని ఆశిష్ తనను బలవంతంగా పెండ్లి చేసుకొన్నాడని దీక్షిత్ ఆరోపించారు. ఆయన తన గురించి వాస్తవాలను తప్పుగా వివరించి, తనను నిరంతరం శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. గత నెలలో ఆయన సహాయకుడు ఒకరు బాధితురాలిని ఓ వాహనంలో బంధించి విడాకులు తీసుకోవాలని లేకపోతే ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు.