జోద్పూర్, ఆగస్టు 16: ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పరీక్షించడానికి మహిళల ఛాతి కొలతను ప్రమాణంగా తీసుకోవడాన్ని రాజస్థాన్ హైకోర్టు తప్పుబట్టింది. ఫారెస్టర్లు కానీ, ఇతర ఏ ఉద్యోగ నియామకానికి సంబంధించిన ఫిజికల్ టెస్ట్‌లో కానీ ఇలాంటి విధానాన్ని అవలంబించడం దారుణం, కచ్చితంగా మహిళల గౌరవాన్ని తగ్గించడమేనని వ్యాఖ్యానించింది.
ఛాతి కొలతలను ప్రమాణంగా తీసుకుని ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగానికి తమను ఎం పిక చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ముగ్గురు మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ దినేష్ మెహతా విచారించారు. ఛాతి కొలతలు తీసుకోవడం ఎంతమాత్రం వాంఛనీయం కాదని ఆయన పేర్కొన్నారు.