Reels | న్యూఢిల్లీ: రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రేమ్ చంద్ బైర్వా కుమారుడు ఓపెన్ టాప్ జీపు నడుపుతూ రీల్ షూటింగ్ చేయడం, ఆయన వాహనానికి రెండు పోలీస్ వాహనాలు ఎస్కార్టుగా రావడం విమర్శలకు దారితీసింది. మైనర్ అయినప్పటికీ వాహనాన్ని నడుపుతూ రీల్ చేయడం, అతనికి పోలీసులు రెండు వాహనాల్లో ఎస్కార్టుగా రావడం అధికార దుర్వినియోగమేనని విపక్షాలు విమర్శించాయి.
ఆ వాహనంలో ప్రేమ్చంద్ బైర్వా కుమారుడు ఆశు బైర్వా వాహనం నడుపుతుండగా, అతని పక్కన కాంగ్రెస్ నేత పుష్పేంద్ర భరద్వాజ్ కుమారుడు కూర్చుని ఉన్నాడు.