జైపూర్: డిప్యూటీ సీఎం కుమారుడు తన స్నేహితులతో కలిసి ఎస్యూవీ డ్రైవ్ చేశాడు. పోలీస్ ఎస్కార్ట్‌తో వెళ్తున్న అతడు రీల్ షూట్ చేశాడు. (Deputy CM son’s reel shoot with police escort) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికార దుర్వినియోగంపై విమర్శలు వెల్లువెత్తాయి. రాజస్థాన్ డిప్యూటీ సీఎం ప్రేమ్ చంద్ బైర్వా కుమారుడు అషు బైర్వా తన స్నేహితులతో కలిసి ఎస్‌యూవీని డ్రైవ్ చేశాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా కోసం రీల్ షూట్ చేశాడు. ‘రాజ్‌నీతి హో యా సడక్, హమ్ హర్ జగహ్ అప్నీ చల్ చలతే హై’ (అది రాజకీయాలైనా లేదా వీధులైనా, మేం ముందుకు సాగుతాం’ అన్న సాంగ్‌కు హావాభావాలు వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ నేత పుష్పేంద్ర భరద్వాజ్ కుమారుడు కార్తికేయ కూడా ఆ వాహనంలో ఉన్నాడు.
కాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో వీవీఐపీ అధికారాలను దుర్వినియోగం చేయడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే రాజస్థాన్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత ప్రేమ్ చంద్ బైర్వా దీనిపై స్పందించారు. తన కుమారుడి చర్యను ఆయన సమర్థించారు. సీనియర్ సెకండరీ చదువుతున్న మైనర్ తండ్రి రాజస్థాన్ డిప్యూటీ సీఎం అయినందునే ఇలా విమర్శిస్తున్నారని ఆరోపించారు. తన కుమారుడి భద్రత కోసమే పోలీసుల కార్లు ఎస్కార్టుగా ఉన్నాయని అన్నారు.