Rajagopal Reddy | కాంగ్రెస్‌లో కొత్తవాళ్ల పెత్తనాన్ని సహించను.. రాజ్‌గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన కొందరు కాంగ్రెస్‌ను కబ్జా చేసి అధికారం చెలాయించాలని చూస్తున్నారని ఆరోపించారు.
Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన కొందరు కాంగ్రెస్‌ను కబ్జా చేసి అధికారం చెలాయించాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలను తాను చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు.
తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారని రాజ్‌గోపాల్ రెడ్డి అన్నారు. తాము వైఎస్సార్ నిజమైన శిష్యులమని పేర్కొన్నారు. వైఎస్సార్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయన ఆశయాల సాధన కోసం పనిచేస్తానని, వైఎస్సార్‌ను ఎప్పటికీ మరచిపోబోనని అన్నారు. ఎంతమంది కుట్రలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా తాను భయపడేది లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌ను నమ్ముకున్న నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూస్తానని రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు.
ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్దఎత్తున ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన రాజ్‌గోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను సీఎం.. సీఎం’ అని పిలుస్తున్నారు. ఆ సమయం గనక వస్తే దాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు’ అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చి ‘రాజన్న రాజ్యం’ కొనసాగిస్తామని రాజ్‌గోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

