జైపూర్: రాజస్థాన్‌లో భారీగా వర్షాలు (Heavy rainfall) కురుస్తున్నాయి. జోధ్‌పూర్‌లో శుక్రవారం రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో వర్షం నీటితో రోడ్లు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జోధ్‌పూర్ నగరంలోని ప్రధాన మార్కెట్ ప్రాంతమంతా మునిగిపోయింది. అలాగే భారీ వర్షాలకు జోధ్‌పూర్ రైల్వేస్టేషన్ జలమయమైంది. దీంతో రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడంతో సేవలకు ఆటంకం కలిగింది.
కాగా, జోధ్‌పూర్‌లోని పలు కాలనీల ఇరుకైన వీధుల్లో వర్షం నీరు కాలువల మాదిరిగా ప్రవహించింది. నీటి ఉధృతికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఒక వ్యక్తి బైక్‌తో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అలాగే బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు నీటిలో పడ్డారు. అయితే బైక్ కొట్టుకుపోగా వారు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియో క్లిప్‌లు చూసి నెటిజన్లు షాకయ్యారు. వర్ష భీభత్సానికి హడలిపోయారు.
#jodhpur में बारिश।#rainalert #rain #FridayFeeling pic.twitter.com/7AjVJYG3eS
— Purnima Bohra (@bohra_vyas) July 22, 2023
जोधपुर की बारिश की कुछ झलकियां#jodhpur #जोधपुर @Jodhpur_suncity #suncity #rain #HeavyRains #Rajasthan pic.twitter.com/KJNQ2GavHO
— Jodhpur (@Jodhpur_suncity) July 21, 2023
Very dangerous lightning, heavy rain #Jodhpur no such #rainwaterhsrvestingsystem @JdaJodhpur @ashokgehlot51 @RajCMO @RajGovOfficial pic.twitter.com/J27IadKiQL
— RAM🇮🇳 (@RAM_SIYARAM_) July 21, 2023