Heavy Rains | భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలం.. 9 జిల్లాలకు ఐఎండీ అలర్ట్
Heavy Rains | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వానలు (Heavy Rains) పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.
Heavy Rains | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వానలు (Heavy Rains) పడుతున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
మరోవైపు ఈశాన్య రుతుపవనాలు (Northeast Monsoon) తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులోని కడలూరు, మైలదుతురై, నాగపట్నం, తిరువారూర్, పుదుచ్చేరి (Puducherry)లోని కారైకల్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, తంజావూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ఐదు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరోవైపు ఎడతెరిపి లేని భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు ఇప్పటికే సెలవు (schools closed) ప్రకటించారు. చెన్నైలోని పాఠశాలలు, తిరువళ్లూరు జిల్లాలోని విద్యాసంస్థలు మూతపడ్డాయి. పుదుచ్చేరి, కారైకల్‌లలో పాఠశాలలు, కళాశాలలకు కూడా అధికారులు సెలవు ప్రకటించారు. అదేవిధంగా పుదుచ్చేరిలో (Puducherry) కూడా స్కూళ్లు, కాలేజీలకు హాలీడే ఇచ్చారు.
Also Read..
Ind Vs Nz | ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌కు బెదిరింపులు.. వాంఖడే స్టేడియం వద్ద హై అలర్ట్
Rashmika Mandanna | రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసు.. బీహార్ యువకుడిని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు
Chiranjeevi | చరణ్ దివాళీ పార్టీలో చిరంజీవి క్రేజీ డ్యాన్స్.. వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

