ముంబై: రైల్వే పట్టాలపై పడిపోయిన బాలుడిని విరోచిత రీతిలో ముంబైకి చెందిన పాయింట్స్‌మ్యాన్ కాపాడిన విషయం తెలిసిందే. ఆ రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కేపై ప్రశంసల వర్షం కురిసింది. రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు నెటిజన్స్ అతన్ని ఆకాశానికి ఎత్తారు. రైల్వే స్టేషన్లో అకస్మాత్తుగా పట్టాలపై పడిన బాలుడిని రక్షించేందుకు.. మయూర్ షెల్కే తన ప్రాణాలకు తెగించి థానే జిల్లాలోని వంగాని స్టేషన్లో రైలుకు ఎదురుగా వెళ్లి ఆ చిన్నారిని కాపాడాడు. అయితే ఇప్పటికే విశేష రీతిలో ప్రజాదరణ పొందుతున్న మయూర్ మరోసారి తన గొప్పతనాన్ని చాటారు. బాలుడిని రక్షించినందుకు రైల్వే శాఖ మయూర్‌కు 50 వేల నగదు బహుమతి ఇచ్చింది. ఇప్పుడు ఆ అమౌంట్లో సగం మొత్తాన్ని ఆ బాలుడికే విరాళం ఇవ్వనున్నట్లు మయూర్ తెలిపాడు. చిన్నారి సంక్షేమం, విద్య కోసం ఆ నగదు ఉపయోగపడుతుందన్నాడు. ఆ చిన్నారి కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నట్లు తెలిసిందన్నాడు. మరోసారి ఔదార్యం చాటిన మయూర్‌పై నెటిజన్లు మళ్లీ ప్రశంసలు కురిపిస్తున్నారు. మానవత్వం సజీవంగా ఉన్నట్లు ఒకరు కామెంట్ చేశారు. ఈ రోజుకు ఇదే పాజిటివ్ న్యూస్ అని మరొకరు స్పందించారు. ఈ సమాజంలో షెల్కే లాంటి వ్యక్తులు ఉండడం మానవత్వానికి గీటురాయిని అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
The only positive news of the day. Humanity and gods work through humans – exhibit A. Mayur, may all the worlds blessings be yours to be happy and prosperous always
— Monica Jasuja (@jasuja) April 22, 2021