కోల్‌కతా: ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో (Delhi stampede) 18 మంది మరణించడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్పందించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌పై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన సగం మంత్రి, పార్ట్‌టైమ్ రైల్వే మంత్రి అని విమర్శించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌పై టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఎక్స్‌లో మండిపడ్డారు. ‘ఆయన హాఫ్ మినిస్టర్. మన పార్ట్‌టైమ్ రైల్వే మంత్రి, మరో రెండు మంత్రిత్వ శాఖల మధ్య గారడీ చేస్తున్నారు (ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్). లక్షలాది మందికి జీవనాధారంగా పరిగణించే ఇండియన్ రైల్వేను నడపడం ఆషామాషి కాదు’ అని విమర్శించారు.
కాగా, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా గతవారం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌పై పార్లమెంట్లో విరుచుకుపడ్డారు. ‘ఇప్పుడు, నేను సగం మంత్రి గురించి మాట్లాడా. నేను సగం సత్యాల గురించి మాట్లాడా. నేను సగం సమాఖ్యవాదం గురించి మాట్లాడా. ఇప్పుడు మనం సగం మంత్రిత్వ శాఖ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మన పార్ట్‌టైమ్ రైల్వే మంత్రి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ (ఐటీ) అనే రెండు మంత్రిత్వ శాఖల మధ్య గారడీ చేస్తున్నారు. లక్షలాది మందికి జీవనాధారంగా పరిగణించే భారతీయ రైల్వేలను నడపడం సైడ్ గిగ్ కాదు’ అని అన్నారు. ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట నేపథ్యంలో టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు.
“He is a HALF MINISTER. Our part-time Railway Minister is juggling between two other Ministries: Electronics & IT, Information & Broadcasting. Running Indian Railways, which is considered a lifeline for millions, is not a side gig”@abhishekaitc on the floor of Parliament pic.twitter.com/gAZbnPCljn
— Derek O’Brien | ডেরেক ও’ব্রায়েন (@derekobrienmp) February 16, 2025