న్యూఢిల్లీ : ఢిల్లీ రైల్వే స్టేషన్ లాంటి తొక్కిసలాట ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని రైల్వే శాఖ నిర్ణయించింది. దానిలో భాగంగా 60 ప్రధాన స్టేషన్లలో శాశ్వత బయట వేచి ఉండే ప్రాంతాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు తెలిపింది. ఇటీవలి ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతి చెందిన క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైలు భవన్లో సీనియర్ రైల్వే అధికారులతో శుక్రవారం సమావేశమైన మంత్రి అశ్వినీ వైష్ణవ్ దేశ వ్యాప్తంగా ప్రధాన స్టేషన్లలో రద్దీ నియంత్రణ చర్యలను అమలు పరిచే విషయంపై చర్చించారు.