చెన్నై, జూలై 8: దేశంలోని పలు చారిత్రక ప్రదేశాలను కలుపుతూ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం ప్రారంభించారు. ఇలాంటి రైళ్లను మరిన్ని ప్రవేశపెడతామని చెప్పారు. హెరిటేజ్ స్పెషల్ పేరిట స్టీమ్ ఇంజిన్ల థీమ్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. రైళ్ల గురించి తెలిసిన పాతతరం వారెవ్వరూ ‘ఆవిరి ఇంజిన్’లను మరిచిపోలేరని, చారిత్రక సంపదకు గుర్తుగా నిలిచిన వాటిని తిరిగి తీసుకువస్తున్నట్టు చెప్పారు. వాస్తవానికి స్టీమ్ ఇంజిన్లు ఇప్పుడు వాడుకలో లేవని, అయితే ఎలక్ట్రిక్ ఇంజిన్లనే వాటిలా కన్పించేలా తయారు చేసి ఈ హెరిటేజ్ రూట్లలో తిప్పుతామని మంత్రి తెలిపారు.