న్యూఢిల్లీ: ఈ మధ్య రైల్వే ప్లాట్‌ఫామ్ పైనుంచి ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిన ఓ చిన్నారిని రైల్వే ఉద్యోగి కాపాడిన సంగతి తెలుసు కదా. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఆ వీడియో వైరల్ అయిపోయింది. మయూర్ షెల్కె అనే ఆ రైల్వే ఉద్యోగి ఒక్కసారిగా నేషనల్ హీరో అయిపోయాడు. రైల్వే ఇప్పటికే అతనికి రూ.50 వేలు బహుమతిగా ఇస్తే.. అందులో సగం ఆ చిన్నారికే ఇస్తానని ప్రకటించి మయూర్ మరింత మంది మనుసులు గెలుచుకున్నాడు. తాజాగా జావా మోటార్‌సైకిల్స్ కోఫౌండర్ అనుపమ్ తరేజా అతనికి ఖరీదైన బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు.
ముందుగా మాట ఇచ్చినట్లే మయూర్‌కు బైక్ ఇచ్చినట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. జావా ఫార్టీ టూ బైక్‌ను మయూర్ అందుకున్నాడు. నెబ్యులా బ్లూ కలర్లో ఉన్న ఈ బైక్ ధర రూ.లక్షన్నరకు పైనే కావడం విశేషం. జావా ఫార్టీ టూ బైక్‌ను ఈ మధ్యే లాంచ్ చేశారు.
We were honored to meet Pointsman #MayurShelke at his residence & hand over the Jawa forty two Golden Stripes Nebula Blue as appreciation for his selfless bravery as part of the #JawaHeroes initiative. More power to you Mayur & loads of respect from the Jawa family & #Kommuniti. pic.twitter.com/LalvesyOsL
— Jawa Motorcycles (@jawamotorcycles) April 23, 2021
Watch again this courageous railway pointsman Mayur who threw caution aside to rescue visually impaired Sangeeta Shirsat's young son from the tracks.
— Anupam Thareja (@reach_anupam) April 23, 2021
And I just heard he donated half his prize money to the mother-son duo. I was awed before, am now humbled. Salute!@RailMinIndia pic.twitter.com/oCrirFhSOa