Rahul Gandhi | బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నేపథ్యంలో కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెల 17 నుంచి బిహార్‌లో ఓటు అధికార్ యాత్ర చేపట్టనున్నారు. రాహుల్ 16 రోజుల పాటు 24 జిల్లాల్లోని 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగుతుందని ఎంపీ అఖిలేష్ సింగ్ తెలిపారు. ఈ మేరకు అన్ని సన్నాహాలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రూ.1,300 కిలోమీటర్ల పొడవైన 16 రోజుల ప్రయాణం బీహార్‌లోని దాదాపు 25 జిల్లాల గుండా సాగనున్నది. అఖిల భారత కూటమిలోని అన్ని పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ సైతం రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొంటారు. రాహుల్ గాంధీ దేశంలో ఓటును బలోపేతం చేయడానికి బయలుదేరారని కాంగ్రెస్ ఇన్చార్జి కృష్ణ తెలిపారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటర్లను బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ ఓటర్ల హక్కుల యాత్రను చేపడుతున్నారు. ఆయన ప్రజా కోర్టుకు చేరుకుని, భారత రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలంటే, ఇక్కడి ఓటర్లను బలోపేతం చేయాలని ప్రజలకు చెబుతారు. బీహార్‌లో ఓటర్ల జాబితాలో సవరణకు వ్యతిరేకంగా, ఓటర్ల చోరీకి వ్యతిరేకంగా పోరాటం ఒక ప్రజా ఉద్యమంగా మార్చడానికి యాత్ర జరుగుతోందని ఆయన అన్నారు. యాత్ర రోహ్తాస్ నుంచి మొదలై.. సెప్టెంబర్ ఒకటిన పాట్నాకు చేరుకుంటుందని వివరించారు.