ఢిల్లీ : ఢిల్లీలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ( CJP) ఆధ్వర్యంలో సోమవారం ఛలో సంసద్ పేరుతో సెంట్రల్ ఢిల్లీలో(Delhi) నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ హింసాత్మకంగా మారిన ఘటన మరవకముందే కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది.
నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ నివాసం ముట్టడికి ప్రయత్నించింది.
పీఎం మోదీ నివాసానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాదయాత్రగా బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ పోలీసులతో వాగ్వాదనాకి దిగాడు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించారు. చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన తెలిపారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారి వెంట ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.