Bharat Jodo Nyay Yatra : రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర జార్ఖండ్‌లో కొనసాగుతోంది. రామ్‌ఘఢ్ జిల్లాలో 200 కిలోల బొగ్గుతో సైకిల్ తొక్కుతున్న కార్మికుడికి రాహుల్ చేయూత ఇచ్చారు. కొద్దిసేపు అతడి సైకిల్‌ను తొక్కి కార్మికుడి భారాన్ని పంచుకున్నారు.
తన జోడో న్యాయ్ యాత్ర రాంచీకి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ దారిలో 200 నుంచి 250 కిలోల బరువు కలిగిన బొగ్గుతో కార్మికులు సైకిళ్లపై వెళుతుండటాన్ని రాహుల్ గమనించి వాహనం నుంచి దిగి కొద్దిసేపు వారితో ముచ్చటించారు. బొగ్గుతో కూడిన సైకిల్‌ను రాహుల్ నడుతుపున్న ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.
ఆ కార్మికుడు రోజుకు 30-40 కిలోమీటర్లు నడుస్తూ కష్టపడుతున్నా అతడి ఆదాయం చాలా తక్కువగా ఉందని పార్టీ పేర్కొంది. భారత్ నిర్మాణానికి పాటుపడుతున్న ఈ కార్మికులకు వారు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని, వారికి న్యాయం జరగాలని ఈ యాత్ర ఉద్దేశం ఇదేనని కాంగ్రెస్ తెలిపింది. ప్రజల సమస్యలను అర్ధం చేసుకుని వారి స్వరం విని వారికి న్యాయం చేయడమే యాత్ర లక్ష్యమని ఆ పోస్ట్‌లో పార్టీ రాసుకొచ్చింది.
Read More :