ఆ పిల్లలను చూశాక.. టీ షర్టే ధరించాలని డిసైడ్ అయ్యా : రాహుల్ గాంధీ
Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎముకలు కొరికే చలిలోనూ టీ షర్ట్ ధరించి జోడో యాత్రలో పాల్గొంటున్న విషయం విదితమే. రాహుల్ టీ షర్ట్‌పై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. టీ షర్ట్
Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎముకలు కొరికే చలిలోనూ టీ షర్ట్ ధరించి జోడో యాత్రలో పాల్గొంటున్న విషయం విదితమే. రాహుల్ టీ షర్ట్‌పై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. టీ షర్ట్ లోపల థర్మల్స్ ధరిస్తున్నారని రాహుల్‌పై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందించారు. గజ గజ వణికిస్తున్న చలిలోనూ తాను టీ షర్ట్ ఎందుకు ధరిస్తున్నాననే విషయంపై రాహుల్ వివరణ ఇచ్చారు. బీజేపీ నాయకులు సమస్యను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. నేను యాత్ర ప్రారంభంలో కూడా టీ షర్ట్ ధరించాను. కేరళలో ఎక్కువ వేడి ఉండటం వల్లే అప్పుడు టీ షర్ట్ వేసుకున్నాను. నా యాత్ర మధ్యప్రదేశ్ చేరుకోగానే, కొంచెం చలిగా అనిపించింది. ఆ సమయంలో ఒక ఉదయం నా దగ్గరకు ముగ్గురు పేద పిల్లలు వచ్చారు. వారు చిరిగిన బట్టలు వేసుకున్నారు. అప్పటికే వారు చలితో వణికిపోతున్నారు. ఆరోజే నిశ్చయించుకున్నాను. నాకు చలిగా అనిపించినప్పటికీ స్వెటర్ ధరించొద్దని డిసైడ్ అయ్యాను. కేవలం టీ షర్ట్ మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నాను. ఆ పిల్లల కంటే నేనేం ఎక్కువ కాదు అని రాహుల్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

