Rahul Gandhi : లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) వచ్చే నెల 7న బీహార్ (Bihar) లో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన పట్నాలో జరగనున్న ‘సంవిధాన్ సురక్షా సమ్మేళన్ (Samvidhan Suraksha Sammelan)’ లో పాల్గొననున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ (Kanhaiya Kumar) చేపట్టిన ‘నౌకరీ దో యాత్ర (Naukari Do Yatra)’ లో పాల్గొననున్నట్టు తెలిసింది.
కాగా రాహుల్‌గాంధీ గురువారం ఢిల్లీలోని ఇందిరా భవన్లో బీహార్‌కు చెందిన కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఇతర ముఖ్య నాయకుల సమక్షంలో బీహార్‌కు చెందిన డీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో పార్టీని జిల్లాల స్థాయిలో బలోపేతం చేయడంపై చర్చ జరిగిందని బీహార్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
ఇటీవల జనవరి 18న, ఫిబ్రవరి 5న రాహుల్‌గాంధీ బీహార్‌లో పర్యటించారు. ఫిబ్రవరి 5 పర్యటన సందర్భంగా రాహుల్‌గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.