Rahul Gandhi | లోక్ సభలో అడుగుపెట్టిన రాహుల్.. ట్విట్టర్ బయోలో కీలక మార్పు
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎట్టకేలకు పార్లమెంట్ లో అడుగుపెట్టారు. పరువు నష్టం కేసులో ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన నాలుగు నెలల తర్వాత లోక్ సభ (Lok Sabha)కు హాజరయ్యారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎట్టకేలకు పార్లమెంట్ లో అడుగుపెట్టారు. పరువు నష్టం కేసులో ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన నాలుగు నెలల తర్వాత లోక్ సభ (Lok Sabha)కు హాజరయ్యారు. గతంలో మోదీ ఇంటి పేరు (Modi surname remark)పై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో గుజరాత్లోని సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. రాహుల్ ఎంపీ హోదాను కూడా పునరుద్ధరించింది. కోర్టు తీర్పుతో రాహుల్ పై వేసిన అనర్హతను లోక్ సభ సచివాలయం ఎత్తివేసింది. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ సోమవారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాహుల్ తిరిగి పార్లమెంట్ లో అడుగుపెట్టారు.
ఈ ఉదయం పార్లమెంట్ కు వచ్చిన రాహుల్ ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంట్ భవనంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కూటమి సభ్యులు రాహుల్ కు ఘనంగా స్వాగతం పలికారు. కాగా, ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్ తన ట్విట్టర్ బయోలో మార్పులు చేశారు. ఎంపీగా అనర్హత వేటు పడితన తర్వాత రాహుల్.. ట్విట్టర్ బయోలో తనను తాను డిస్ క్వాలిఫైడ్ ఎంపీగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మార్చుకున్నారు.
మరోవైపు మోదీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానంపై రేపు లోక్ సభలో చర్చ ప్రారంభం కానుంది. దీనిపై పార్లమెంట్ సమావేశాలు చివరి రోజు అంటే ఈనెల 10వ తేదీన మోదీ సమాధానమివ్వనున్నారు. కాగా, అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఒక్కరోజు ముందు రాహుల్ తన ఎంపీ సభ్యత్వం పొంది పార్లమెంట్ లో అడుగుపెట్టడం కీలకపరిణామంగా విపక్ష కూటమి సభ్యులు భావిస్తున్నారు.
#WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and MP Rahul Gandhi at the Parliament in Delhi.
Lok Sabha Secretariat today restored Rahul Gandhi's Lok Sabha membership. pic.twitter.com/2MjBSybUEb
— ANI (@ANI) August 7, 2023
संसद की सदस्यता बहाल होने के बाद जननायक @RahulGandhi जी संसद पहुंचे।
संसद पहुंचते ही उन्होंने परिसर में लगी गांधी प्रतिमा को प्रणाम कर आशीर्वाद लिया।
ये करोड़ों भारतवासियों की जीत है।
असत्य के खिलाफ सत्य की जीत है।
नफरत के खिलाफ मोहब्बत की जीत है। pic.twitter.com/RjO921MQDn— Congress (@INCIndia) August 7, 2023
Also Read..
Samantha | గాయని చిన్మయి పిల్లలతో సమంత ఆటలు
Vande Bharat Train | వందేభారత్ పై ఆగని దాడులు.. రైలుపై మరోసారి రాళ్లు రువ్విన ఆకతాయిలు
Rahul Gandhi | ఎంపీగా తిరిగి పార్లమెంట్ లో అడుగుపెట్టనున్న రాహుల్.. అనర్హతను ఎత్తివేసిన దిగువ సభ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

