న్యూఢిల్లీ : 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కు అయిపోయాయని కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం ఆరోపించారు. ఇది రాజ్యాంగంపై జరిగిన నేరమని దుయ్యబట్టారు. ఏఐసీసీ ఇందిరా భవన్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గురువారం మీడియా సమావేశంలో ఆన్లైన్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనేక రాష్ర్టాల ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తుల పేర్లు ఉన్నాయని చెప్పారు.
బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం, దాని పరిధిలోని మహదేవ పుర శాసన సభ నియోజకవర్గంలో పోలింగ్ తీరును విశ్లేషించారు. ఒక్క మహదేవపురలోనే లక్ష నకిలీ ఓట్లు ఉన్నట్లు చెప్పారు. రాహుల్ ఆరోపణలపై స్పందించిన ఈసీ.. సంబంధిత వివరాలను డిక్లరేషన్ రూపంలో ఇవ్వాలని, దానిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది.