Parineeti Chopra | త్వరలో ఆప్ ఎంపీతో హీరోయిన్ వివాహం.. కన్ఫమ్ చేసిన సింగర్
Parineeti Chopra - Raghav Chadha | ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా , బాలీవుడ్ స్టార్ నటి పరిణీతి చోప్రా ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ సింగర్ (Bollywood Singer ) హార్డీ సంధు (Harrdy Sandhu).. వీరి వివాహాన్ని ధృవీకరించారు. త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు కన్ఫమ్ చేశారు.
Parineeti Chopra – Raghav Chadha | ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా , బాలీవుడ్ (Bollywood) స్టార్ నటి పరిణీతి చోప్రా ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరూ కలిసి వరుసగా డిన్నర్ డేట్ (Dinner Dates), లంచ్ మీటింగ్స్ (Lunch Meets) అంటూ చట్టాపట్టాలేసుకు తిరగడమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని, త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, రిలేషన్షిప్ స్టేటస్‌పై ఇప్పటి వరకు వీరిద్దరూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆప్ ఎంపీ (AAP MP) సంజీవ్ అరోరా (Sanjeev Arora) గత వారం చేసిన ఓ ట్వీట్ రాఘవ్ చద్దా, పరిణీతి మధ్య బంధాన్ని నిర్ధారించేలా ఉంది. ‘రాఘవ్, పరిణీతిలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారిద్దరి బంధం ప్రేమ, ఆనందంతో నిండిపోవాలి’ అని ఓ ట్వీట్ చేశారు. దీంతో అందరూ వీరి వివాహం ఖాయమని భావించారు. తాజాగా బాలీవుడ్ సింగర్ (Bollywood Singer ) హార్డీ సంధు (Harrdy Sandhu).. వీరి వివాహాన్ని ధృవీకరించారు. త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు కన్ఫమ్ చేశారు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హార్డీ సంధు మాట్లాడుతూ.. ‘ఎట్టకేలకు వారిద్దరూ (రాఘవ్ చద్దా-పరిణీతి) త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆమెకు అన్నీ శుభాలు జరగాలని కోరుకుంటున్నా’ అంటూ చెపుకొచ్చాడు. అంతేకాదు ఈ విషయంలో పరిణీతికి ఫోన్‌చేసి శుభాకాంక్షలు చెప్పినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం సంధు కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Crime News | ప్రియుడితో పారిపోయేందుకు స్కెచ్.. ఎవరికీ అనుమానం రాకుండా తనలాగే ఉన్న యువతిని హత్య చేసి
India Corona | రెండో రోజూ మూడు వేలకుపైనే కొత్త కేసులు.. 15వేల మార్క్‌ను దాటిన యాక్టివ్ కేసులు
Elon Musk | ట్విట్టర్లో రికార్డు సృష్టించిన మస్క్.. ఒబామాను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

