Radhikapur Express | ట్రక్కును ఢీకొట్టిన రాధికపూర్ ఎక్స్ప్రెస్.. ఇంజిన్లో చెలరేగిన మంటలు..!
Radhikapur Express | పశ్చిమ బెంగాల్లో రాధికపూర్ ఎక్స్ప్రెస్ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పింది. ధూలియన్గంగ, బల్లాల్పూర్ స్టేషన్ల మధ్య వేకువ జామున ఒంటిగంట తర్వాత గంటలకు ఈ ఘటన జరిగింది.
Radhikapur Express | పశ్చిమ బెంగాల్లో రాధికపూర్ ఎక్స్ప్రెస్ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పింది. ధూలియన్గంగ, బల్లాల్పూర్ స్టేషన్ల మధ్య వేకువ జామున ఒంటిగంట తర్వాత గంటలకు ఈ ఘటన జరిగింది. రైలు పట్టాలు తప్పగా.. ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బోగీల నుంచి ఇంజిన్ను వేరు చేసి మంటలను ఆర్పివేశారు. ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
ఈస్టర్న్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కౌశిక్ మిత్రా మాట్లాడుతూ ప్రమాదం గురించి తెల్లవారు జామున 1.15 గంటలకు సమాచారం వచ్చింది. ట్రక్కును ఢీకొనడంతో రాధికపూర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిందన్నారు. రైలు మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్థలానికి చేరుకొని చేరుకొని మంటలను ఆర్పివేశారన్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని.. రైలులోని ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారన్నారు. ప్రమాదం తర్వాత ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

